హైదరాబాద్: 28°C
వార్తలు

కార్మిక శాఖ సహాయ కమిషనర్‌గా బాధ్యతలు

బాపట్ల జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్‌గా యం. కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వీ. వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సహాయ కమిషనర్ కలెక్టర్‌కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.