హైదరాబాద్: 28°C
వార్తలు

వాటర్‌ సప్లై పైపులైన్‌ పనులకు శంకుస్థాపన

ప్రకాశం: కనిగిరి స్థానిక మోడల్‌ స్కూల్‌ వెనుక అమృత్‌ 2.0 పథకం కింద చేపట్టనున్న వాటర్‌ సప్లై పైపులైన్‌ నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా కల్పించడంతో పాటు భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.