హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం

జార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. వేలాదిగా విద్యార్థులు ఆ రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటడానికి ప్రయత్నించగా.. పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని వారు తెలిపారు.