WNP: చిన్నంబావి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.33,03,828 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం కాకుండా ప్రభుత్వం రూ.1,00,116 సాయం అందిస్తోంది. చెక్కులు పొందిన లబ్ధిదారులు సీఎం, మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ


