హైదరాబాద్: 28°C
వార్తలు

'సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

BPT: ప్రజా సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తెలిపారు. చందోలులో ర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం-ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని గడప గడపకూ తిరిగారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.