AKP: చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రూ.5.70 కోట్లతో నిర్మిస్తున్న 50 పడకల ఆసుపత్రి భవన పనులను ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు సోమవారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భవనం అందుబాటులోకి వస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.
వార్తలు
50 పడకల ఆసుపత్రి నిర్మాణం పరిశీలన


