హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిడ్స్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

ATP: హెచ్‌ఐవీ/ఎయిడ్స్, లైంగిక వ్యాధుల నివారణపై అవగాహన కల్పించే పోస్టర్లు, బుక్‌లెట్లను అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ సోమవారం రెవెన్యూ భవన్‌లో ఆవిష్కరించారు. ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు, కళాజాత బృందాలతో ప్రచారం చేపడతామన్నారు.