హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు నిర్మించాలని వినతి

VSP: మాధవధారలోని GVMC నార్త్ జోన్ ఆఫీసులో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమానికి 7 వినతులు వచ్చాయని జోనల్ కమిషనర్ రాము తెలిపారు. ఆయన బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సింగరాయమెట్ట ప్రాంతంలో రోడ్డు నిర్మించాలని వినతి అందజేశారు. మొత్తం వినతుల్లో టౌన్ ప్లానింగ్ నుంచి 2, పబ్లిక్ హెల్త్ -1, ఇంజినీరింగ్ -2, యూసీడి -2 వినతులు వచ్చాయన్నారు.