హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రానికి రూ.10,463 కోట్ల ఆదాయం

బంగారం, వెండిపై పన్ను పెంపు నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఏడాది మే 13 నుంచి సుంకాల పెంపు ద్వారా.. ప్రభుత్వానికి రూ.10,463 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ విషయాన్ని కేంద్రం లోక్‌సభలో అధికారికంగా ప్రకటించింది. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం కోసం.. మే నెలలో బంగారం, వెండిపై ఉన్న దిగుమతి సుంకాన్ని 6 శాతం నుండి 15 శాతానికి పెంచింది.