హైదరాబాద్: 28°C
వార్తలు

పశ్చిమ బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం

బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ(1975) కాలంలో జరిగిన నిరసనల్లో పాల్గొని, జైలు శిక్ష అనుభవించిన రాష్ట్రానికి చెందిన 325 మందికి నెలకు రూ.10,000 చొప్పున పెన్షన్ అందజేయనుంది. వారి త్యాగాల పునాదుల మీదే నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందని సీఎం సువేందు అధికారి పేర్కొన్నారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలకు, వారి ఆశయాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.