జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(JPSC) నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షల అవకతవకల కేసులో CID సంచలన నిర్ణయం తీసుకుంది. JPSC మాజీ ఛైర్మన్ ఎల్.ఖియాంగ్తేను అరెస్ట్ చేసింది. పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఓ సంస్థకు పరీక్షల కాంట్రాక్ట్ అప్పగించడంపై సీఐడీ అధికారులు ఖియాంగ్తేను అరెస్ట్ చేశారు.
వార్తలు
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చీఫ్ అరెస్ట్


