హైదరాబాద్: 28°C
వార్తలు

పేపర్ లీక్‌లపై చర్చకు సిద్ధం: కిరణ్ రిజిజు

పేపర్ లీక్‌ల అంశంపై సభలో పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అలాగే, విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్‌లో ప్రకటన చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో విపక్షాలు సభను అడ్డుకోకుండా, అమిత్ షా ప్రసంగాన్ని వినాలని కోరారు.