హైదరాబాద్: 28°C
వార్తలు

'బడి జ్ఞాపకాల ఒడిలో షబ్బీర్ అలీ'

KMR: తాను విద్యనభ్యసించిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ సందర్శించారు. పాత భవనంలోని తరగతి గదిలో కాసేపు కూర్చొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.