హైదరాబాద్: 28°C
వార్తలు

లోక్‌సభ రేపటికి వాయిదా

విద్యార్థులపై పోలీసుల దాడులు, అయోధ్య విరాళాల చోరీ అంశాలపై లోక్‌సభలో చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. 'ట్రైబ్యునల్స్ సంస్కరణల బిల్లు' ఆమోదం పొందిన తర్వాత కూడా సభలో నిరసనల హోరు తగ్గలేదు. కనీస చర్చ లేకుండా కీలక చట్టాలను ప్రభుత్వం ఏకపక్షంగా బుల్డోజ్ చేస్తోందని విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సభలో గందరగోళం తీవ్రం కావడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.