KMR: ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ఆంజనేయులు సూచించారు. రాజంపేట కస్తూరిబా బాలికల పాఠశాలలో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
వార్తలు
'సైబర్ నేరాలకు దూరంగా ఉండాలి'


