హైదరాబాద్: 28°C
వార్తలు

500 అడుగుల జాతీయ జెండాతో తిరంగా యాత్ర

MDK: పీఎం మోదీ పిలుపు మేరకు మంగళవారం రామాయంపేటలో 500 అడుగుల జాతీయ జెండాతో తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. శివాజీ విగ్రహం వద్ద యాత్ర ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ హాజరుకానున్నారు. ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని రాగి రాములు పిలుపునిచ్చారు.