హైదరాబాద్: 28°C
వార్తలు

'బస్సు చైతన్యయాత్రను జయప్రదం చేయండి'

MDK: కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న 'గీతన్నల బస్సు చైతన్య యాత్ర'ను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం రామాయంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. కార్మికుల డిమాండ్ల సాధనకు చేపట్టే ఈ యాత్రలో గౌడ సోదరులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.