నంద్యాల పట్టణం అయ్యలూరులోని జడ్పీ ప్రాథమిక ఉర్దూ పాఠశాల విద్యార్థినులకు 'గుడ్ బ్యాడ్ టచ్' పై శక్తి టీం అవగాహన కల్పించారు. సోమవారం అపరిచిత వ్యక్తుల గురించి వివరించి, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను తెలియజేశారు. సైబర్ నేరాలపై తల్లిదండ్రులకు వివరించాలని, ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
వార్తలు
'గుడ్ బ్యాడ్ టచ్' పై అవగాహన


