హైదరాబాద్: 28°C
వార్తలు

వాటర్ ట్యాంకును ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: ఆత్రేయపురం మండలం వద్దిపర్రులో జలజీవన్ మిషన్ ద్వారా రూ.65 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. వాటర్ ట్యాంకు అందుబాటులోకి రావడంతో గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.