హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఐఎన్టీయూసీ నిరసన

NLG: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎన్టీయూసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ ఎన్జీ కళాశాల వద్ద రోడ్డుపై ఆందోళన చేపట్టారు. నిరసనలో పాల్గొన్న ఆందోళనకారులను టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు అంబటి సోమయ్య, ఎండీ మొహినుద్దీన్, సుంకిశాల వెంకన్న, సోలిపురం శంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.