హైదరాబాద్: 28°C
వార్తలు

కుబీర్‌లో పంటల వైవిధ్యీకరణపై ప్రత్యేక గ్రామసభ

NRML: కుబీర్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎల్‌నినో ప్రభావం, పంటల వైవిధ్యీకరణపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఏఈవో కదం సందేశ్ పటేల్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు పంట మార్పిడి చేయాలని, దీర్ఘకాలిక ఆదాయానికి ఆయిల్ ఫామ్ సాగు ఎంచుకోవాలని కోరారు. నీటి సంరక్షణకు కుంటలు నిర్మించుకోవాలని, ఎరువుల యాప్ వాడుతూ క్రాప్ బుకింగ్ చేయాలన్నారు.