AP: తిరుపతి(D) చంద్రగిరి పరిధిలోని ఎర్రవారిపాలెం అటవీ ప్రాంతంలో సుమారు 22 ఏనుగుల గుంపును అటవీశాఖ అధికారులు గుర్తించారు. కోటకడపల్లి పరిధిలోని సిద్ధలగండి చెరువు సమీపంలో సంచరిస్తున్నట్లు తెలిపారు. ఏనుగులు వీఆర్ కాలనీ, వేములవాడ, కోటకడపల్లి గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అయ్యగారిపల్లి, పులిగోనపల్లి, నెరబైలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వార్తలు
చంద్రగిరి అటవీ ప్రాంతంలో 22 ఏనుగులు


