NTR: నందిగామలో సీఐటీయూ ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. చందర్లపాడు బస్టాండ్ నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టి కార్మికులు స్వచ్ఛందంగా అరెస్టయ్యారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాలు, ఉపాధి హామీ వేతనం రూ.600 చేయాలని వారు డిమాండ్ చేశారు.
వార్తలు
నందిగామలో జైలు భరో కార్యక్రమం


