KMR: కామారెడ్డి పట్టణం 16వ వార్డు కౌన్సిలర్ యాడారం ప్రియాంక తండ్రి ఇటీవల అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, మనోధైర్యంతో ఉండాలని సూచించారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.
వార్తలు
కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే


