హైదరాబాద్: 28°C
వార్తలు

జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని బీజేపీ ధర్నా చేపట్టింది. సీఎం హేమంత్ సోరెన్ నివాసం ముట్టడికి యత్నించింది. ధర్నా చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకునే యత్నం చేశారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఆందోళనకారులను అరెస్ట్ చేసిన అధికారులు పీఎస్‌కు తరలించారు.