హైదరాబాద్: 28°C
వార్తలు

నర్సులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు

MNCL: వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సులు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు వార్తలొచ్చినా పరిస్థితి మారలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేళ కాకముందే సిబ్బంది వెళ్లడంతో పేషెంట్లను ఎవరు చూస్తారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి నర్సుల కొరతను తీర్చాలని కోరుతున్నారు.