హైదరాబాద్: 28°C
వార్తలు

మొక్కకు 'పెద్ది' అని నామకరణం

WGL: చెన్నారావుపేట మండలం పాత మగ్దూంపురం మాజీ సర్పంచ్ సుంకరి లావణ్య-సాంబయ్య దంపతులది ఇవాళ పెళ్లిరోజు. ఈ సందర్భంగా పెళ్లిరోజును పురస్కరించుకుని మాజీ MLA, స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు మీద వారు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ పట్ల తమకున్న బాధ్యతను చాటుకున్నారు. అలాగే పెద్ది పై అభిమానంతో మొక్కకు 'పెద్ది సుదర్శన్ రెడ్డి' అని నామకరణం చేశారు.