హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఓ సోఫా మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 16 మంది బంగ్లాదేశీ మైగ్రెంట్ వర్కర్లు కాలి బూడిదయ్యారు. దీనిపై స్పందించిన బంగ్లా ప్రభుత్వం మృతదేహాలను గుర్తించి స్వదేశానికి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్లు తెలిపింది. కాగా సౌదీలో దాదాపు 35 లక్షల మంది బంగ్లాదేశీయులు వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నారు.