హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం

ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. ఉత్తరకాశీలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూకుదుపులు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.