హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాకు స్మార్ట్ రేషన్ కార్డులు..!

ఖమ్మం జిల్లాకు 4.72 లక్షల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయి. ఈ నెల 15 నుంచి వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 748 రేషన్ షాపుల పరిధిలో ఉన్న కార్డుదారులకు ఇవి అందనున్నాయి. ఈ కొత్త కార్డులపై క్యూఆర్ కోడ్ ఉండటంతో కుటుంబ సభ్యుల వివరాలు, పాత రేషన్ సరుకుల సమాచారం సులభంగా తెలుసుకోవచ్చు.