హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసిన మున్సిపల్ వైస్ ఛైర్మెన్

ASF: కాగజ్‌నగర్‌ పట్టణంలోని తమ నివాసం వద్ద PM నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొత్తపల్లి అనిత-శ్రీనివాస్ దంపతులు జాతీయ జెండాను ఎగురవేశారు. వారు మాట్లాడుతు.. త్రివర్ణ పతాకం దేశ స్వాతంత్య్రానికి, ఐక్యతకు, సమగ్రతకు ప్రతీక అన్నారు. మోదీ పిలుపుతో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.