ASR: డుంబ్రిగుడ మండలంలోని సొవ్వ పంచాయతీ కమలబంధలో VB-G RAM G పథకం ద్వారా సిల్వర్, వివిధ రకాల పండ్ల మొక్కలను వైసీపీ నేత పాంగి నరసింగరావు సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ ఆధ్వర్యంలో పలువురికి మొక్కలు అందజేశారు. మొక్కలను నాటి సంరక్షించాలని నరసింగరావు సూచించారు. మొక్కల పెంపకంతో, పర్యావరణ పరిరక్షణ, అదనపు ఆదాయం లభిస్తుందన్నారు
వార్తలు
కమలబంధలో సిల్వర్, పండ్ల మొక్కల పంపిణీ


