హైదరాబాద్: 28°C
వార్తలు

గుంతల్లో నీరు.. వాహనదారులకు గుబులు!

విజయనగరం పట్టణంలోని అంబేడ్కర్ కూడలి-కొత్తపేట నీళ్ల ట్యాంకు మార్గంలో జొన్నగుడ్డి పాఠశాల కూడలి వద్ద రహదారి గుంతలమయంగా మారింది. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు రహదారి పరిస్థితి కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మార్గంలో పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, కళ్యాణ మండపాలు ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుందని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు.