ASF: PM మోదీ పిలుపు మేరకు నియోజకవర్గంలోని ప్రతి బీజేపీ కార్యకర్త తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని సిర్పూర్ MLA హరీశ్ బాబు ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి జెండా వందనం చేసి, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని సూచించారు. దేశభక్తిని చాటే కార్యక్రమంలో ప్రతి కార్యకర్త భాగస్వామై 'హర్ ఘర్ తిరంగా'ను విజయవంతం చేయాలని కోరారు.
వార్తలు
'ప్రతి కార్యకర్త హర్ ఘర్ తిరంగా విజయవంతం చేయాలి'


