హైదరాబాద్: 28°C
వార్తలు

గన్నారంలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్

ASF: కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామంలో పోలీసులు సోమవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అనంతరం గ్రామస్థులకు సైబర్ నేరాలు, డయల్-100 వినియోగంపై అవగాహన కల్పించారు.