ప్రకృతి ప్రకోపానికి అసోం విలవిలలాడుతోంది. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 100 మంది మృతి చెందారు. శివసాగర్, కచార్, కరీమ్‌గంజ్, గోలాఘాట్ జిల్లాలు వరదల వల్ల అత్యధికంగా ప్రభావితమయ్యాయి. వందలాది గ్రామాలు నీట మునగగా, వేలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వార్తలు
అసోంలో వరదలు.. 100 మంది మృతి


