SRD: కంది మండల కేంద్రంలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి 90 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన కుమ్మరి రాధ ఇంటికి తాళం వేసి హైదరాబాద్ లోని తన కూతురు వద్దకు వెళ్లారు. దీన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి వెండిని దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
చోరీ.. 90 తులాల వెండి అపహరణ


