హైదరాబాద్: 28°C
వార్తలు

22 వేల కోట్ల సబ్సిడీ బియ్యం పక్కదారి: ఆప్

ఢిల్లీలో సబ్సిడీ బియ్యం కొనుగోళ్లు, విక్రయాలలో భారీ కుంభకోణం జరిగినట్లు ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. మూడేళ్లలో దాదాపు రూ.22 వేల కోట్ల స్కాం జరిగిందని తెలిపారు. ఈ బియ్యాన్ని ఢిల్లీ ప్రభుత్వం, అసోంకు చెందిన కార్పొరేషన్ కలిసి హర్యానాలోని ఓ ప్రైవేట్ కంపెనీకి కిలో రూ.46కు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఇలా వారానికి రూ.143 కోట్ల స్కాంకు జరుగుతుందని వెల్లడించారు.