WGL: ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దాదాపు మీటరు నుంచి రెండున్నర మీటర్ల లోతు వరకు పడిపోయాయి. ప్రస్తుతం వరంగల్-6.65, హన్మకొండ-7.71, జనగామ-9.14, భూపాలపల్లి-11.98, మహబూబాబాద్-6.02, ములుగు-7.11 మీటర్లుగా ఉన్నాయి. అయితే ఆగస్టు నెల గడిచే సరికి భూగర్భ జలాలు మరో మీటర్ మేర తగ్గనున్నట్లు అధికారులు అంచనావేస్తున్నారు.
వార్తలు
అడుగంటుతున్న భూగర్భ జలాలు


