హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి SIRపై మీనాక్షి నటరాజన్ ఆరా

TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు SIR పురోగతిపై కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు నిర్వహించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరిగే ఈ సమావేశాల్లో SIR అమలు, ఇతర కీలక అంశాలను ఆమె పరిశీలిస్తారు. కాగా.. ఇవాళ ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల పరిస్థితిపై ఆమె ప్రత్యేకంగా సమీక్ష జరుపనున్నారు.