HNK: కాజీపేటలోని ఓ టిఫిన్ సెంటర్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.05 లక్షల విలువైన టీవీ, డ్రిల్లింగ్, కటింగ్ మెషిన్లతో పాటు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సమర్థవంతంగా పనిచేసిన పోలీసు సిబ్బందిని ACP ప్రశాంత్ రెడ్డి అభినందించారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.
వార్తలు
టిఫిన్ సెంటర్ చోరీ కేసు ఛేదింపు


