హైదరాబాద్: 28°C
వార్తలు

మోసపోయిన డబ్బు తిరిగి ఇప్పించిన పోలీసులు

JN: వాట్సాప్‌లో వచ్చిన గుర్తుతెలియని యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడంతో బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన జూల సత్యనారాయణ ఖాతా నుంచి రూ.43 వేలు మాయమయ్యాయి. జూన్ 26న జరిగిన ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు నగదును హోల్డ్ చేయించి, అవసరమైన ప్రక్రియ అనంతరం బాధితుడికి తిరిగి ఆదివారం అప్పగించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.