JN: వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. జఫర్‌గఢ్‌కు చెందిన కోల సోని(28)కి సముద్రాలకు చెందిన తాడెం అనిల్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేయడంతో పురుగుల మందు తాగి మృతి చెందింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వేణు తెలిపారు.
వార్తలు
వరకట్న వేధింపులు.. వివాహిత ఆత్మహత్య


