హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా పోలీస్ అసోసియేషన్ EC మెంబర్‌ ఎన్నిక

భద్రాద్రి జిల్లా పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు EC మెంబర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో పాల్వంచ సీఐ కె.సతీష్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. పోలీస్ శాఖలోని సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నాగేశ్వరరావు తెలిపారు.