హైదరాబాద్: 28°C
వార్తలు

సంతల ద్వారా మార్కెట్‌కు రూ.3.06 లక్షల ఆదాయం

అనంతపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ వారం జరిగిన జీవాలు, పశువుల సంతల ద్వారా రూ.3.06 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు చైర్ పర్సన్ బల్లాపల్లవి తెలిపారు. ఫీజు వసూళ్లు పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరిగింది. శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ.1.53 లక్షలు, ఆదివారం జరిగిన పశువులు, గేదెలు, ఎద్దుల సంత నుంచి రూ.1.53 లక్షలు మేర వసూలైనట్లు తెలిపారు.