KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే రేక్ పాయింట్‌కు ఆదివారం కాంప్లెక్స్ ఎరువు వచ్చినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. 394 మెట్రిక్ టన్నుల డీఏపీ, 723 మెట్రిక్ టన్నుల 20:20:0:13 రకం కాంప్లెక్స్, 255 మెట్రిక్ టన్నుల పొటాష్ రాగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల దుకాణాలకు లారీలు, ట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
వార్తలు
జిల్లాకు చేరుకున్న కాంప్లెక్స్ ఎరువులు


