హైదరాబాద్: 28°C
వార్తలు

పైలట్ కళ్ళల్లో లైట్.. తప్పిన ప్రమాదం

కౌలాలంపూర్ నుంచి 159 మంది ప్రయాణికులతో కోల్‌కతా చేరుకున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం రన్‌వేపై దిగుతున్న సమయంలో అకస్మాత్తుగా పైలట్ కళ్లపై లేజర్ కిరణాలు పడ్డాయి. అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా ల్యాండింగ్‌ను నిలిపివేశారు. లేజర్ లైట్లను ఎవరు ప్రయోగించారనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.