హైదరాబాద్: 28°C
వార్తలు

మమతా బెనర్జీ కారుపై దాడి!

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ కార్యకర్త బిర్జూ లాకప్ డెత్ ఘటన రాజకీయంగా దుమారం రేపింది. అతడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ సీఎం మమతా బెనర్జీ వాహనాన్ని నిరసనకారులు చుట్టుముట్టి రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. రాష్ట్రం గూండాల చేతుల్లోకి వెళ్లిపోయిందని మమత మండిపడ్డారు. ఈ ఘటన అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది.