AP: కడప జిల్లా దువ్వూరుకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఇరగంరెడ్డి వెంకటరామిరెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. భర్త మృతిని తట్టుకోలేక భార్య లక్ష్మీనారాయణమ్మ స్వగ్రామానికి వస్తున్న మార్గమధ్యంలోనే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. గంటల వ్యవధిలో దంపతులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
వార్తలు
మృత్యువులోనూ వీడని బంధం.. దంపతుల మృతి


