GDWL: అయిజ పట్టణ శివారులోని గోదాము వద్ద కల్వర్టు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన కల్వర్టు రోడ్డు విస్తరణ సమయంలో రక్షణ గోడలు తొలగించినా, పునర్నిర్మించలేదు. దీంతో కల్వర్టుపై గుంతలు ఏర్పడి రాత్రివేళ ప్రమాదాల ముప్పు నెలకొంది. నూతన కల్వర్టు నిర్మించి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.
వార్తలు
శిథిలావస్థలో కల్వర్టు.. పొంచి ఉన్న ప్రమాదం


